calender_icon.png 5 June, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎస్‌ఆర్ పథకం ద్వారా డీఆర్డీఏకి ఏసీల విరాళం

09-04-2025 02:17:48 AM

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 8  (విజయక్రాంతి): సామాజిక బాధ్యత సి ఎస్ ఆర్ కార్యక్రమంలో భాగంగా, కెనరా బ్యాంక్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ  కు  రెండు ఎయిర్ కండీషనర్ (ఏసి) యూనిట్లు అందజేసింది. డి ఆర్ డి ఏ సూచనల మేరకు, ఈ ఏసి లను ఇందిర మహిళ శక్తి క్యాంటీన్ (ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయం) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రయోగశాలలో ఏర్పాటు చేశారు.

దీని వల్ల మహిళా శక్తి క్యాంటీన్ లో పని చేసే ఉద్యోగులకు, వినియోగదారులకు అనుకూలమైన వాతావరణం కలుగుతుండగా, ఆసుపత్రి ప్రయోగశాలలో నమూనాల నిల్వ మరియు నిర్వహణకు అనుకూలిస్తాయి . కెనరా బ్యాంక్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ఉద్దేశిస్తూ డిఆర్డిఏ అధికారి   నాగిరెడ్డి కెనరా బ్యాంకు అధికారులను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ తరహా సి ఎస్ ఆర్ కార్యక్రమాలు సామాజిక సేవకు మంచి ఉదాహరణగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీ కే.శివరామకృష్ణ,కెనరా బ్యాంకు భువనగిరి చీఫ్ మేనేజర్ శ్రీ మిథిన్ రాజ్,బ్యాంకు  అధికారులు, అధికారులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.