24 June, 2026 | 2:27 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

కేరళలో యాక్షన్ షురూ

26-04-2026 01:07 AM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’తో తన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఇంటెన్స్ గ్లింప్స్‌తో మంచి బజ్ సృష్టించింది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిలమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా కేరళలో 15 రోజుల బ్రూటల్ యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. కేచా ఖంపక్దీ మాస్టర్ హై వో ల్టేజ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు.

రష్మికతోపాటు కీలక నటీనటులు పాల్గొంటున్న ఈ యాక్ష న్ షెడ్యూల్ సినిమాలో పతాకా స్థాయిలో ఉండబోతోంది. ఈ చిత్రంలో రష్మిక ఒక గోండ్ తెగకు చెందిన అమ్మాయిగా కనిపిస్తోంది. ఈ పాత్రకు ఎమోషనల్ డెప్త్‌తోపాటు శారీరక దృఢత్వం కూడా అవసరం.

ఇందుకోసం రష్మిక అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో బ్యాంకాక్‌కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్ ట్రైనింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని శ్రేయాస్ పీ కృష్ణ నిర్వహిస్తుండగా, జేక్స్ బీజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.