05-02-2026 01:13:51 AM
శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘లీడర్’. లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, అమృత అయ్యర్, వీటీవీ గణేశ్, ఐశ్వర్య వివిధ పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు. పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
అనుకోని పరిస్థితుల్లో అండర్ వరల్డ్ మాఫియా, పోలీసుల ఫోర్స్ మధ్య చిక్కుకున్న ఓ సాధారణ వ్యక్తి కథ ఇది. ఈ రెండు వర్గాల సంఘర్షణ మధ్య తనని తాను రక్షించుకుంటూ ఈ సాధారణ వ్యక్తి ఎలా బయటపడ్డాడనేది సినిమా అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్ వైబోధ; సినిమాటోగ్రఫీ: ఎస్ వెంకటేశ్; ఎడిటింగ్: ప్రదీప్ ఇ.రాఘవ్; ఆర్ట్: జీ దురైరాజ్.