22 June, 2026 | 9:26 PM

పొట్పల్లి–దుగా తండాకు బీటి రోడ్డు నిర్మాణ పనులు

22-06-2026 08:12 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని పొట్పల్లి గ్రామం నుంచి దుగా తండా 1.6 km వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా ఈ రహదారి అధ్వాన్నంగా ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన 1.6 కోట్ల నిధులతో చేపట్టిన ఈ రోడ్డు పనులు పూర్తయ్యాయి.

గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు విద్యార్థులు, రైతులు, ప్రయాణికులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందని సర్పంచ్ తుక్కమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో పొట్పల్లి గ్రామ సర్పంచ్ తుక్కమ్మ, పండరి పాటిల్, వెంకట్ పాటిల్, సచిన్ పాటిల్, శేరి రామ్ రెడ్డి, అవుసలి సాయిలు, వెంకట్ రెడ్డి, దేవిదాస్, స్థానిక ముఖ్య నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, దుగా నాయక్ తండా ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.