22 June, 2026 | 9:26 PM

ఈ రోడ్డు గతి మార్చరా

22-06-2026 08:42 PM

ఖానాపూర్ మున్సిపాలిటీలో మారని అంతర్గత రోడ్ల దుస్థితి

ఖానాపూర్,(విజయక్రాంతి):  నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ లోని అంతర్గత రోడ్ల దుస్థితి చెప్పనలవి కాదు. దశాబ్దాల క్రితం వేసిన సిసి రోడ్లు విధ్వంసమయి రోడ్డు సగం కొట్టుకుపోయినా ప్రస్తుత పాలకవర్గాలు పట్టించుకోవడం లేదంటే ఆశ్చర్యం లేదు. మున్సిపాలిటీలోని 8వ వార్డులో ఒక రోడ్డు దుస్థితి ఇది. ఏళ్ల తరబడి సగం కొట్టుకుపోయిన రోడ్డుపై కాలనీవాసులు బ్రతికీడిస్తున్నారు. సి సి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి, డ్రైనేజీ సగం కూలిపోయి, మురికి నీరు పైకి  వస్తున్న పట్టించుకున్న నాధులు లేడని కాలనీవాసులు మొత్తుకుంటున్నారు.

అదే డ్రైనేజీ నుంచి మిషన్ భగీరథ పైప్ లైన్లు కనెక్షన్లు ఉండడంతో కాలనీవాసుల త్రాగునీటి పరిశుభ్రత గాల్లో దీపంగా మారింది. ఈ నేపథ్యంలో కాలనీవాసులు తోట రవీందర్, రాజేష్ లు చేసేది లేక కాలనీవాసులము చందాలు వేసుకుని రోడ్డు బాగు చేద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇకనైనా అధికారులు, నాయకులు, పట్టించుకుని కాలనీలోని అంతర్గత రోడ్లను బాగు చేయడంపై దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.