22 June, 2026 | 10:12 PM

సిర్గాపూర్ రైతు వేదికలో విత్తనాల మేళా

22-06-2026 08:56 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ...రైతులకు నాణ్యమైన విత్తనాల ఎంపిక, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తన శుద్ధి విధానాలపై అవగాహన కల్పించారు.

ప్రభుత్వం గుర్తింపు పొందిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు వివిధ పంటల విత్తనాలను పరిశీలించి కొనుగోలు చేశారు. ఈ మేళా ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి రావడంతో పాటు పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.