22 June, 2026 | 9:57 PM

కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గా మెరుగు భోజన్న నియామకం

22-06-2026 08:53 PM

బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా మెరుగు భోజన్నను నియమిస్తూ డిసిసి అధ్యక్షులు జాదవ్ నరేష్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణానికి చెందిన ఈయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు. రాజకీయ వారసత్వ కుటుంబానికి చెందిన ఈయనకు పదవి దక్కడంతో ఆయన అనుచర వర్గంలో వర్షం వ్యక్తమవుతున్నది. అయితే ఇంతకుముందు మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా నియామకం జరిగిన శ్రీకాంత్ రెడ్డి ని తొలగించి ఈయనను నియమించడం జరిగింది