22 June, 2026 | 8:43 PM

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

22-06-2026 08:09 PM

– విద్యార్థులకు ఎస్సై ప్రశాంత్ రెడ్డి అవగాహన

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో కోనరావుపేట ఎస్సై కే.ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ వినియోగం కారణంగా జరుగుతున్న నేరాలు, యువతపై పడుతున్న ప్రతికూల ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తుపై కలిగే దుష్పరిణామాల గురించి విద్యార్థులకు వివరించారు.

డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు మరియు మంచి అలవాట్లపై దృష్టి సారించాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో విద్యార్థులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.