ఫిట్‌నెస్ లేని బస్సులపై చర్యలు తీసుకోవాలి
ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్
చుంచుపల్లి, జూన్ 23 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు బస్సు ఫిట్నెస్ లపై సమగ్ర విచారణ జరపాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ కోరారు. మంగళవారం ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆర్టీవో రాజశేఖర్ ను కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ పరిమితీ కంటే ఎక్కువ మొత్తంలో విద్యార్థుల్ని బస్సులో ఎక్కిస్తూ ప్రమాదాలకు గురి చేస్తున్నటువంటి విద్యాసంస్థలపై,
లైసెన్సులు లేకుండా మైనర్ డ్రైవర్లను నియమించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటాలాడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల కళాశాలల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. . బస్సులో అగ్నిమాపక పరికరం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మరియు (అత్యవసర ద్వారం) సరిగ్గా పని చేసేవిధంగా తక్షణమే జిల్లా అధికారయంత్రగం తనిఖీలు చెప్పాటాలినీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఇనపల్లి పవన్ సాయి జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్ నాయకులు కళ్యాణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు






