24 June, 2026 | 1:45 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది

24-06-2026 01:04 AM

ఘట్ కేసర్, జూన్ 23 (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ముత్యాల్ యాదవ్ అన్నారు. మంగళవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్ కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివేషన్) ప్రక్రియపై ఏసీఈ ఇంజనీరింగ్ కాలేజీలో కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిసిసి కార్యదర్శి ముత్యాల్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే కీలక ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా బిఎల్‌ఎ లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.

ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రవీందర్, మాజీ సర్పంచ్ మేడబోయిన వెంకటేష్ ముదిరాజ్, మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదిరాజ్, మీసాల సుధాకర్ రావు, గడీల సంజీవరెడ్డి, సల్లూరి నర్సింగ్ రావ్, ఉల్లి ఆంజనేయులుయాదవ్, ఉపాధ్యక్షులు నాగరాజు, బిబ్లాక్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మేకల సునీల్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్, సేవాదళ్ అధ్యక్షులు రాజారత్నం, మైనారిటీ నాయకులు ఖయ్యూం, రెహ్మాన్, నాయకులు కడపోల్ల రాజు, శివరాత్రి సురేష్, గోద సురేష్ యాదవ్, బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.