29 June, 2026 | 2:04 AM

బాలాపూర్ ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి

29-06-2026 12:00 AM
  1. లేనిపక్షంలో అన్ని ప్రజా పౌరహక్కుల సంఘాలతో కలిసి ఉద్యమం చేపడుతాం
  2. పీయూసీఎల్ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది జయవింధ్యల

ముషీరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో కిరాతక హింస, యువకులపై లైంగిక దాడులు, బ్లాక్ మెయిల్ చేస్తున్న ఎస్‌ఐ ప్రసాద్, సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీలకు పౌర హక్కుల ప్రజా సంఘం (పీయుసీఎల్) డిమాండ్ చేసింది. లేని పక్షంలో అన్ని ప్రజా, పౌర హక్కుల సంఘాలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించింది.

సోమవారం సీఎం, డీజీపీ, డీసీపీ, ఏసీపీలకు వినతి పత్రాలు అందజేస్తామని పీయుసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది జయ వింధ్యాల చెప్పారు. ఈ మేరకు ఆదివారం హైదర్ గూడలోని ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటుచేసిన  మీడియా సమావేశంలో బాధితులు మహమ్మద్ జహంగీర్, మహమ్మద్ అబ్దుల్లా, వారి భార్య, పిల్లలతో కలిసి ఆమె మాట్లాడారు. బాలాపూర్ పీఎస్ పరిధిలోని మహమ్మద్ నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ జహంగీర్, మహమ్మద్ అబ్ధుల్లా అనే ఇద్దరు అన్నదమ్ములు వారి భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్నారని చెప్పారు.

కాగా వీరి మరో సోదరుడైన అసద్ పేరును పోలీసులు రౌడీషీట్ లో చేర్చి నగర బహిష్కరణ చేశారని, ఈ కారణంతో బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ప్రసాద్ వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఈ నెల 23వ తేదీ రాత్రి 11-30 గంటలకు ఎస్‌ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులు అబ్దుల్లాను ఇంటి నుంచి బయటకు పిలిపించి కారులో ఎక్కించుకుని కొట్టడం ప్రారంభించారని, అప్పటికే జహంగీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఈ ఇద్దరిని బాలాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి డార్క్ రూమ్ లో ఉంచి బట్టలు విప్పి నగ్నంగా ఉంచారని ఆమె ఆరోపించారు.

వారిని పోలీసులు రబ్బరు, ప్లాస్టిక్ రాడ్లుతో కొట్టారని, అంతేకాకుండా ప్రైవేటు భాగాలపై తీవ్రంగా కొట్టడమే కాకుండా ఎర్ర కారాన్ని వారి ప్రైవేటు భాగాల్లో పెట్టి చిత్ర హింసలకు గురిచేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అత్యంత అమానవీయంగా గుప్తాంగాలను నోట్లో పెట్టి పిల్చుకునేలా (ఓరల్ సెక్స్) చేయించారని, ఆ సమయంలో వీడియోలు తీసి, వాటిని ఇతర రౌడీలకు చూపించి బ్లాక్ మెయిల్ ప్రయత్నం చేశారని ఆరోపించారు.

వారిని పోలీసులు 24వ తేదీ తెల్లవారు ఝామున పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపడం జరిగిందన్నారు.పోలీసులు అబ్దుల్లా వద్ద నుంచి 40 రూపాయలు, మొబైల్ ఫోన్, ఆధార్ కార్డును గుంజుకున్నారని, దీంతో వారు ఆరు నెలల పసిపాపతో ఇల్లు విడిచి పోయి జీవిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.ఏ నేరం చేయని వారిని పోలీసులు ఎందుకు హింసిస్తున్నారని, వారి సోదరుడు అసద్ ను నగర బహిష్కరణ చేసిన పోలీసులకు అతను ఎక్కడ ఉన్నాడో పోలీసులకే తెలుస్తుందని ఆమె ఆరోపించారు.