29 June, 2026 | 2:04 AM

ప్రభుత్వం గుర్తించిన వరి విత్తనాలను సాగు చేసిన రైతులకు బోనస్

29-06-2026 12:00 AM

కేసముద్రం, జూన్ 28 (విజయక్రాంతి): ప్రభుత్వం గుర్తించిన సన్న రకం వరి విత్తనాలను సాగుచేసిన రైతులకు మాత్రమే 500 రూపాయల బోనస్ క్వింటాలుకు ఇవ్వడం జరుగుతుందని మహబూబాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు.

కేసముద్రం మండలం మహమూద్ పట్నం రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి విధానం పాటించాలని, వాణిజ్య పంటల సాగు వైపు దృష్టి సారించాలని, ఆధునిక, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకన్న, ఏఈఓ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.