వీఆర్కేపురంలో ‘పల్స్ పోలియో’
చిన్నారులకు చుక్కలు వేసి ప్రారంభించిన సర్పంచ్ రమ్య
వెంకటాపురం (నూగూరు)/జూన్ 28(విజయ క్రాంతి):- మండలంలోని వీఆర్కేపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ఎంపీపీఎస్ పాఠశాల మరియు హెల్త్ సబ్ సెంట ర్ వద్ద సర్పంచ్ డి. రమ్య ఐదేళ్లలోపు చి న్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమ్య మాట్లాడుతూ, ‘చిన్నపిల్లల నిండు జీవితానికి రెండు చుక్కలే భరోసా.
ప్రతి పోలియో చుక్క వారి ఆరోగ్యానికి పునాది. భవిష్యత్తును సురక్షితంగా ఉంచే అక్షయపాత్రలు ఈ చుక్కలు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలి‘ అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పూనెం రాజేశ్వరి, డాక్టర్ భాస్కర్, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కొప్పుల కోటిరెడ్డి,ఏఎన్‌ఎమ్ విమల, అంగన్వాడీ టీచర్లు మంగతాయారు,కళ్యాణి, ఆశా వర్కర్లు జనగం లక్ష్మి, బుర్క రమణ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.






