26 May, 2026 | 1:56 AM

ప్రైవేటు స్కూళ్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి

26-05-2026 12:23 AM

ముషీరాబాద్, మే 25 (విజయక్రాంతి): ముషీరాబాద్ మండల పరిధిలోని పలు ప్రైవే ట్ పాఠశాలలు ప్రభుత్వం నిర్దేశించిన విద్యా నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల తల్లి దండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవా లని ధర్మసమాజ్ పార్టీ ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు దూడపర్తి సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ముషీరాబాద్ జోన్ డిప్యూటీ ఎడ్యూకేషనల్ ఆఫీసర్ ను కలిసి ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సంతోష్ కుమార్ విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి ప్రైవేటు పాఠ శాల దోపిడీకి పాటుపడుతున్నారని మం డిపడ్డారు. ఈ సమస్యపై జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాం డ్ చేశారు. లేనిపక్షంలో ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్ర మాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శివప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు.