26 May, 2026 | 1:56 AM

నిజామాబాద్ జిల్లాలో లారీ బీభత్సం

26-05-2026 12:24 AM
  1. 44వ జాతీయ రహదారిపై ఏడు కార్లను  ఢీ కొట్టిన లారీ 
  2. రణరంగంగా మారిన రహదారి 

కామారెడ్డి, మే 25 (విజయక్రాంతి):  నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం లారీ బీభత్సవాన్ని సృష్టించింది. ఏడు కార్లను ఢీకొంటూ బీభత్సావాన్ని సృష్టించింది. ఈ ఘటన 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఇందల్వాయి మండలం  చంద్రయన్ పల్లి  సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

44వ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో తో వెనుక నుంచి వస్తున్న కార్లు ఒకదాని కి మరొకటి డి కొనడంతో ఏడు కార్లు ధ్వంసం అయ్యాయి.ఢీ కొట్టిన కార్ల లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కార్లలో  బెలూన్ లు తె తెరచుకోవడంతో భారీ ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగక లేదు. కానీ 7 కార్లు ధ్వంసం అయ్యాయి. హైదరాబాద్ నుంచి నిజాంబాద్ వైపు వెళ్తున్న లారీ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్ర యాన్ పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కార్లు వెనుక నుంచి ఒకదానికొకటి ఢీకొట్టాయి.

కార్లలో బెలూన్లు తేర్చుకోవడంతో కారులలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు ప్రాణనష్టం జరగలేదు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని వెంటనే ఇందల్వాయి పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని నిజాంబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందల్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో పలు వాహనదారులు ఆపి సంఘటన ను వీక్షించారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వాహనదారులను ఓదార్చారు. అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. గాయపడిన వారిని పోలీసులు, స్థానికులు 108 అంబులెన్స్ ల ద్వారా ఆసుపత్రికి తరలించారు.