విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలి
అలంపూర్ ఏప్రిల్ 17: గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులను పారదర్శకంగా నిర్వర్తించాల్సిన గ్రామ పంచాయతీ కార్యదర్శి విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాక గ్రామస్తులు కట్టిన ఇంటి పన్ను పైసలను సొంత అవసరాలకు వాడుకోవడం, ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం గ్రామస్తులు ఎంపీడీవో రాఘవను కలిసి వినతి పత్రాన్ని అందించారు.
గ్రామ సెక్రటరీ ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఇష్టానుసారంగా విధులకు హాజరుతూ.. పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వాటి ప్రారంభోత్సవాలకు గ్రామం సెక్రటరీకి సమాచారం అందించిన అట్టి కార్యక్రమాలు హాజరు కాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని గ్రామస్తులు మండిపడ్డారు. గ్రామ సర్పంచి భర్త బీజేపీ నాయకుడికి సెక్రటరీ వత్తాసు పలుకుతూ... దళితులు పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నట్లూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి గ్రామ పంచాయతీ సెక్రటరీ మార్చాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వినతి పత్రం అందించిన వారిలో గ్రామస్తులు రమేష్ బుచ్చన్న, శాంతన్న,యోబు, రవి,ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు.






