18 April, 2026 | 1:59 AM

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

18-04-2026 12:27 AM

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ

గాంధారి, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు భోజన విరామ సమయంలో పలు ఉద్యోగ సంఘాల నాయకులు తహసిల్దార్ రేణుకా చౌహాన్ కు వినతి పత్రం అందచేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారి న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సత్యనారాయణ, చిరంజీవి,స్వామి, పంచాయతీ రాజ్ ఉద్యోగ సంఘాల నేతలు, రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.