మాల్తుమ్మెద గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం
18-04-2026 12:26 AM
నాగిరెడ్డిపేట్ ఏప్రిల్ 27 విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో జిల్లా పశుగాణభివృద్ధి సంఘం మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ... రైతులు పశువ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా టీకాలు వేయించుకోవాలని సూచనలు ఇవ్వడం జరిగింది.
మాల్తుమ్మెద గ్రామంలో 49 గేదలకు మరియు 2 ఆవులకు గర్భశాయ చికిత్సలు చేయడం జరిగింది.41దూడలకు నట్టల నివారణ మందులు మరియు 24 సాధారణ చికత్సలు 24 సిసిటీవీ రైతులు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు,ఉప సర్పంచ్ శివకుమార్,డిఎల్డిఏ సూపెర్వైసోర్ కృష్ణ,విఏ విజయ,మైత్రి,శ్రీహరి, పరందాములు,ఓఎస్ జయరాజు గంగారాము, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.






