29 July, 2026 | 2:12 AM

‘డబుల్’ అవకతవకలపై చర్యలు తీసుకోవాలి

29-07-2026 12:16 AM

ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి

శంకర్ పల్లి: జూలై 28(విజయ క్రాంతి ) డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో జరిగిన అవకతవకల పై అధికారులు చర్యలు తీసుకోవాలని  మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, పీఏసీస్ శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని చందిప్పలోని తన వ్యవసాయ క్షే త్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఎ న్నో అవకతకులు జరిగాయని, తమ వద్ద వి ధులు  నిర్వహిస్తున్న డ్రైవర్లకు, వారి సామాజిక వర్గానికి ఇళ్లను కేటాయించారని ఆరోపించారు. 

మాజీ సీఎం కేసీఆర్ ఇళ్లు లే ని వారికి శంకర్‌పల్లి శివారులో1600 డబు ల్ బెడ్ రూమ్లను నిర్మించారని, అందులో  మండలానికి 151 ఇండ్లను మంజూరు చేశారని గుర్తు చేశారు. అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఎమ్మెల్యే యాదయ్య టిఆర్‌ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తాము వెంట నుండి గెలిపించామని ఇప్పుడు ప్రస్తుతం పార్టీ మారి తమపై విమర్శలు చేయించడం ఎంతవరకు సమంజసం అని వారు మండిపడ్డారు.