02-02-2026 04:00:43 PM
- కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
గుండాల,(విజయక్రాంతి): ఆదివారం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని సిట్ విచారణ నిర్వహించిన సందర్భంలో పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు మణుగూరు పట్టణ కేంద్రంలో నల్ల జెండాలతో ధర్నా నిర్వహించడం జరిగిందని, ఆ సమయంలో రేగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి సంగతి చూస్తామని బెదిరించడం సరైన పద్దతి కాదని, ఒక గౌరవ హోదా అనుభవించిన రేగా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం, ప్రజా క్షేమం కోరే విధంగా నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందే కానీ అది హద్దులో ఉండాలని పీఎస్ఆర్-పీవీఆర్ యువసేన కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఎస్కే ఖదీర్ అన్నారు.
సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై సైదా రాఫూఫ్ కు మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై హత్యా బెదిరింపులు చేస్తూ, అప్రజాస్వామిక వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై చట్ట పరమైన చర్యలు చేపట్టి, మా నాయకులకు రక్షణ కల్పించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుండాల మండల ఏఎంసీ డైరెక్టర్ ఊకే బుచ్చయ్య, సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య, మండల నాయకులు వాంకుడోత్ బీకోజీ, వాంకుడోత్ రమేష్, ఊకే బాబురావు, ఎస్కే వాజీద్ పాషా, ఎస్కే ఖాసీం, అరెం నర్సింహారావు, పల్లపు రాజేష్, నూనావత్ రవి, సనప రాంబాబు, బానోత్ నరేందర్, గడ్డం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.