02-02-2026 03:56:47 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నియోజకవర్గ కన్వీనర్ లేంగురె శ్యాంరావు
కాగజ్ నగర్,(విజయక్రాంతి): సిర్పూర్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎంఎల్సీ దండే విట్టల్ సమక్షంలో బీఆర్ఎస్ నాయకుడు, నియోజకవర్గ కన్వీనర్ లేంగురె శ్యాంరావుతో పాటు కోయవాగు, చింతగూడ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
లేంగురె శ్యాంరావు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీకి వీడ్కోలు పలికారు. ఆయన సిర్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కన్వీనర్‌గా, అలాగే ఆర్ఎస్పీ ప్రధాన అనుచరుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోయవాగు, చింతగూడ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామస్థులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కాంగ్రెస్ పార్టీలో చేరారు.