5 July, 2026 | 1:59 AM

యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’

05-07-2026 12:21 AM

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పర్చుకొని, విభిన్నమైన సినిమాలు చేస్తుంటారు. అందుకే ఆయనకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రస్తుతం రాజమౌళి, మహేశ్‌బాబు కాంబోలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇదిలావుంటే, పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా నటించిన చిత్రం ‘ఐ, నోబడీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన పార్వతి తిరువోతు హీరోయిన్‌గా నటించింది. నిస్సాం బషీర్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ జూలై 9న మలయాళంలో, జూలై 10న తెలుగులో థియేటర్లలో విడుదల కానుంది.

శ్రీ స్రవంతి మూవీస్, మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. భావోద్వేగాలు, సస్పెన్స్, యాక్షన్ అంశాలను సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేయడం పక్కా అని టీమ్ చెబుతోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దినేశ్ పురుషోత్తమన్; సంగీతం: జేక్స్ బిజోయ్.