26-11-2025 01:39:13 PM
ఉమ్మడి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి సరిత సర్దార్ సింగ్
గాంధారి,(విజయక్రాంతి): నూతన డిసిసి నియామకంపై నోరు జారితే చర్యలు తప్పవు అని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి గాంధారి కంటెస్టెంట్ జెడ్పిటిసి సరిత సర్దార్ సింగ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా గతంలో డిసిసి అధ్యక్షులుగా పనిచేసిన వారిని తప్పించి పార్టీ ప్రక్షాళనలో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తల, అభిప్రాయాల సేకరణ చేపట్టి దాని ఆధారంగా కామారెడ్డి జిల్లాకు నూతన డిసిసి అధ్యక్షులుగా గతంలో కామారెడ్డి డిసిసి అధ్యక్షుడిగా ఉన్న వారిని కాకుండా నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆలే మల్లికార్జున్ ను నియమించారు.
మల్లికార్జున్ యువ నాయకుడు అతను కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించిన రాష్ట్ర అధినాయకత్వం డిసిసి అధ్యక్షులుగా ఆలే మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నియమించడం జరిగింది. రాష్ట్ర నాయకత్వం నిర్ణయంపై ఒక వర్గానికి చెందిన సానుభూతిపరులు నాయకత్వం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గతంలో ఏకచక్రాధిపత్యం వహిస్తూ తమ వర్గానికి మీ పదవులు ఇచ్చుకున్నప్పుడు సంతృప్తి వ్యక్తం చేయని వారు ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కొంతమంది పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇతర పార్టీలో ఉన్న తమ సామాజిక వర్గానికి చెందిన నేతను గెలిపించుకోవాలని గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో ఇతర పార్టీలకు ఓట్లు వేయించిన నాయకులు నియామకం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.
గతంలో జిల్లా నాయకులుగా చెప్పుకొని పార్టీలో కొనసాగుతూ తమ అనుచరులను ఇతర పార్టీలోకి పంపించి స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ టికెట్ కు ఒక రేటు జడ్పిటిసి టికెట్ కు ఒక రేటు నిర్ణయించి టికెట్లు అమ్ముకున్న సంగతి జిల్లా ప్రజలకు తెలుసు తెలుసు అని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా మొన్నటి వరకు ఏనాడు కూడా ఏ నియోజకవర్గంలోనూ ఏ మండలంలోనూ పార్టీ పలోపేతం కోసం సమావేశాలు సభలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.ఆశ్చర్యం ఏమిటంటే గతంలో జిల్లాకు పెద్దదిక్కు అని చెప్పుకునే నాయకుల చేతిలో కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు మరియు నాయకులు అనేక విధాలుగా నష్టపోయారు. జిల్లాలో పార్టీ పరంగా ప్రభుత్వపరంగా ఏ అవకాశం వచ్చిన ఒక నేత తనకు అడుగులు మడుగులు ఒత్తే వారికే ఎంతో కొంత బేరం కుదుర్చుకొని పదవులను కట్టబెట్టడం జరిగింది.
జిల్లాలో తాను ఓడిపోవడం వేరే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం ఆ నేతకు మింగుడు పడటం లేదు.తన సామ్రాజ్యం కూలిపోతుందన్న భయంతో తమ అనుచరులతో పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పేపర్ స్టేట్మెంట్లు ఎవరు ఇప్పిస్తున్నారో జిల్లా ప్రజలకు, రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఉంది. చాలామంది ఆశవాహు లు సదాశివ నగర్ మండలానికి చెందిన సీనియర్ నాయకుడు లింగ గౌడ్ లాంటి నిజమైన కార్యకర్తలు పార్టీ పదవులు ఆశించడంలో ఇటువంటి తప్పులేదు కానీ పార్టీకి స్థానిక నాయకుడికి వ్యతిరేకంగా పనిచేసే ఆశించే వారందరికీ పదవులు వరించవు సందర్భాన్ని బట్టి పార్టీకి కట్టుబడి పని చేసే వారికి సరియైన సమయంలో కచ్చితంగా గుర్తింపు ఉంటుంది.
అందుకు NSUI నుండి నేటి పిసిసి అధ్యక్షునిగా నియమించబడిన మహేష్ కుమార్ గౌడ్ ఒక మంచి ఉదాహరణ, ఎవరైనా సరే ఆశావాహుల్లో ఆందోళన ఉంటే జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర పిసిసి అధ్యక్షుని అపాయింట్మెంట్ కోరి తమ కోరికలను వ్యక్తపరచడంలో తప్పులేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరియు కార్యకర్తల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నియమించిన కామారెడ్డి డిసిసి నియామకంపై నోరు జారితే పార్టీ క్రమశిక్షణలో భాగంగా వేటు వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవడు కూడా అధైర్య పడకుండా కాంగ్రెస్ పార్టీ పార్టీ కొరకు పనిచేసిన వారందరిని గుండెలో పెట్టుకొని చూసుకుంటుందని సమయానుకూలంగా అందరికీ పదవులు వస్తాయని రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా అందరూ సమిష్టిగా కృషిచేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర వేసుకోవాలని ఆయన సూచించారు.