calender_icon.png 26 November, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాన అవకాశాలు.. రాజ్యాంగం కల్పించిన గొప్పతనం

26-11-2025 01:46:00 PM

వనపర్తి,(విజయక్రాంతి): దేశంలో అన్ని వర్గాల వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కుతున్నాయంటే అది రాజ్యాంగం కల్పించిన గొప్పతనమేనని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్ హాల్లో నవంబర్ 26, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతతో కలిసి  రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేత భారత రాజ్యాంగం పీఠికను ప్రతిజ్ఞ చేయించారు.

రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాల వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు దక్కుతున్నాయంటే అది రాజ్యాంగం కల్పించిన గొప్పతనమేనని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే నేడు అందరూ ఫలాలు అందుకుంటున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు విధులు, బాధ్యతలు కూడా పౌరులు గుర్తెరిగి రాజ్యాంగం పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, కలెక్టరేట్ ఏ వో భాను ప్రకాష్, డిపిఆర్ఓ సీతారాం నాయక్, డిఆర్డిఓ ఉమాదేవి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.