calender_icon.png 26 November, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులను అడ్డుపెట్టి బిసి ఉద్యమాన్ని ఆపలేరు

26-11-2025 01:35:02 PM

బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూపునార్ రమేష్

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో బీసీ సంఘం నాయకులకు పోలీసులు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ రూపున రమేష్ మాట్లాడుతూ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అపడం ఎంత కష్టమో పోలీసులను అడ్డుపెట్టి న్యాయపరమైన బీసీ ప్రజా ఉద్యమాన్ని అడ్డుకోవడం అంతే అన్నారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 335 సర్పంచ్ స్థానాలు ఉంటే అందులో కేవలం 20 స్థానాలను బీసీలకు కేటాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చీకటి ఒప్పంద కారణంగానే బీసీ రిజర్వేషన్ కేటాయించకుండా ఎన్నికలకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే బీసీల దృష్టిలో రేవంత్ రెడ్డి  చరిత్ర హీనుడిగా మిగులుతాడన్నారు. బిజెపి ఎంపీలు బీసీలకి రాష్ట్రంలో మద్దతు ఇస్తున్నారు కాని కేంద్రాన్ని ఒత్తిడి చేసే దమ్ము లేదా అని ప్రశ్నించారు.  ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్, బీసీ విద్యార్థి సంగం జిల్లా అధ్యక్షులు లోబడే లాహుకుమార్, బీసీ రైతు అధ్యక్షులు వైరాగడే మారుతీ పటేల్, బీసీ సంగం నాయకులు శెండే నాందేవ్, తరుణ్ తదితరులు ఉన్నారు.