20 June, 2026 | 6:49 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

26-11-2025 01:43 PM

తపస్ జిల్లా అధ్యక్షుడు ములుకల్ల తిరుపతి

కాటారం,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నివేదికను తెప్పించుకుని పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, ఉపాధ్యాయ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జిల్లా అధ్యక్షుడు ములుకల్ల తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాటారం డివిజన్ కేంద్రంలో గల వివేకానంద హైస్కూల్ లో జరిగిన కాటారం డివిజన్ తపస్ కార్యనిర్వాక వర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ములుకల్ల తిరుపతి మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలగా పిఆర్సిని ప్రకటించకుండా ప్రభుత్వం వాయిదా వేస్తున్నదని,

దీనితో ఉపాధ్యాయులు ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం పిఆర్సిపి నివేదికను తెప్పించుకొని  51 శాతం పి.ఆర్.సి ప్రకటిస్తూ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు  జిపిఎఫ్, రిటైర్మెంట్ తదితర బిల్లులు చెల్లించకుండా ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బిల్లులన్నింటిని చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో కాటారం డివిజన్ పరిధిలోని కాటారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలుగా బూరం స్వరూప, నీల శ్రీకాంత్,  గౌరవ అధ్యక్షులుగా కడివెండి ప్రభాకర్, అసోసియేట్ అధ్యక్షులుగా సోమ సురేష్, ఉపాధ్యక్షులుగా ఎలబోయిన శ్రీకాంత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మలహర్రావు మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా జంగిలి రాజేందర్, మురళీ మనోహర్ రావు, మహా ముత్తారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లుగా చెరిపల్లి విజయ్ కుమార్, పంజాల అశోక్ లను నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలన అధికారి నల్ల శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.