ఫిట్‌నెస్ లేని బస్సు రోడ్డెక్కితే చర్యలే
- జిల్లా రవాణా శాఖ అధికారి వంశీధర్
జగిత్యాల/కామారెడ్డి, జూన్ 14 (విజయ క్రాంతి): ఫిట్‌నెస్ లేని స్కూల్, కాలేజీ బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి వంశీధర్ హెచ్చరించారు. శుక్రవారం ఫిట్‌నెస్ లేని ప్రైవేట్ స్కూల్, కాలేజీ బస్సులను రవాణాశాఖ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సు ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అధికారులు తనిఖీ చేశారు. ఫిట్‌నెస్ లేని మూడు స్కూల్ బస్సులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వంశీధర్ మాట్లాడుతూ.. జిల్లాలో 470 స్కూల్, కాలేజ్ బస్సులకు 320 మాత్ర మే ఫిట్‌నెస్ కలిగి ఉన్నాయని, మిగతావి ఫిట్‌నెస్ చేపించుకోవాలని యజమానులకు సూచించారు.
కామారెడ్డిలో మినీటాక్సి సీజ్
కామారెడ్డి పట్టణంలో జిల్లా రవాణా శాఖ అధికారులు పాఠశాల బస్సుల తనిఖీలు చేపట్టారు. 23 మంది పిల్లల్ని తీసుకెళ్లుతున్న ఓ ప్రైవేట్ స్కూల్‌కి చెందిన మినీ టాక్సి వాహనాన్ని సీజ్ చేసి, జరిమానా విధించినట్టు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. జిల్లాలో 231 బస్సుల్లో ఇప్పటివరకు 130 పైచిలుకు బస్సులు మాత్రమే ఫిట్‌నెస్ అయ్యాయని, మిగతా బస్సులను త్వరలో ఫిట్‌నెస్ చేసుకోవాలని సూచించారు.






