అడిక్షన్ సైకియాట్రిక్‌కు ప్రాధాన్యం
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
హైదారాబాద్, జూన్14 (విజయక్రాంతి): మత్తు పదార్థాలు, మద్యానికి బానిసైవారు, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారికి సకాలంలో చికిత్స అందిస్తే, కోలుకుని సాధారణంగా మారేందుకు అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. అడిక్షన్ సైకియాట్రిక్ ద్వారా వైద్యులు అందించే చికిత్సకు మరింత ప్రాధాన్యం పెరగడం ద్వారా ఇలాంటి రోగాలను నయం చేసేందుకు అవకాశం లభిస్తుం దని పేర్కొన్నారు. ఇండియన్ సైకియాట్రిక్, తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో నిజామాబాద్‌లో అడిక్షన్ సైకియాట్రిక్‌పై జరిగే జాతీయస్థాయి సదస్సు బ్రోచర్‌ను శుక్రవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతోపాటు అడిక్షన్ సైకియాట్రిక్‌పై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశాల్ ఆకుల, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్, ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్ డాక్టర్ జార్జిరెడ్డి, డాక్టర్ ఫణికాంత్, డాక్టర్ రవితేజ, డాక్టర్ అశోక్, అలీమ్ చందానీ ఉన్నారు.






