10 May, 2026 | 4:46 PM

ప్రజారోగ్య సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

22-06-2024 03:55 AM
  • జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

కామారెడ్డి, జూన్ 21 (విజయక్రాంతి): ప్రజారోగ్య సంరక్షణపై  నిర్లక్ష్యం వ్యహించే వైద్యసిబ్బందిపై చర్యలు తప్పవనిజుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హెచ్చరించారు. జుక్కల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం  వైద్యారోగ్యశాఖ, వ్యవసాయశాఖధికారులతో నిర్వహిం చిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అధికారులు, డాక్టర్లు సమన్వయంతో పని చేయాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సమకూ ర్చాలన్నారు. సమావేశంలో ఏడీఏ లక్ష్మీప్రసన్న, ఆయా మండలాల వ్యవసా యధికారులు పాల్గొన్నారు