17 July, 2026 | 8:54 AM

పేదలకు మెరుగైన విద్యనందించడమే ధ్యేయం

22-06-2024 03:53 AM
  • స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, జూన్ 21(విజయక్రాంతి): పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మిగిలిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఉపా ధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు.

విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచేలా కృషి చేయాలన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి ఏడు బడులను ఎంపిక చేసి ఆ బడులకు ఉత్తమ పురస్కారాలు అందజేస్తామ న్నారు. ప్రథమ పురస్కారం రూ.25 లక్షలు, ద్వితీయ పురస్కారం రూ.15 లక్షలు, తృతీ య పురస్కారం రూ.10 లక్షలు అందజేస్తామన్నారు. సమావేశంలో డీఈవో రాము, వివిధ మండలాల ప్రత్యేక అధికారులు, నోడ ల్ అధికారులు, ఇంజినిరింగ్ అధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.