14-02-2026 12:54:18 AM
చైర్మన్, మేయర్ ఎన్నిక పూర్తయ్యే వరకు అమలులోనే కోడ్
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవడం, రాజకీయ పార్టీలు- క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో రాష్ట్ర ఎన్నికల సం ఘం అప్రమత్తమైంది. కోడ్ ఉల్లంఘిస్తే విజేతలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీచేసింది. కలెక్టర్లు, మున్సిపల్ కమిషన ర్లు, జిల్లాల ఎన్నికల అధికారులకు ఎస్‌ఈసీ మార్గదర్శకాలు విడుదల చేసింది.
ము న్సిపల్ చైర్మన్, మేయర్ల ఎన్నిక పూర్తయ్యే వర కు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందని రా ష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ముగ్గురికి మించి కలిసి ఉండరాదని, ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా వ్యవహరిం చరాదని తెలిపిం ది. ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉంటామని డిక్ల రేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అదే రోజు మధ్యా హ్నం 12.30 గంటలకు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్‌చైర్మన్, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఎన్నిక ధ్రువీకరణ పత్రం స్వయంగా విజేతలకే అందజేయాలని ఎన్నికల సంఘం తెలిపిం ది. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ప్రైవేట్, టూరిస్టు బస్సుల్లో వెళ్లవద్దని పేర్కొంది. కోడ్ ఉల్లంఘించిన విజేతలు, పార్టీలకు వెంటనే నోటీ సు ఇవ్వాలని జిల్లా ల అధికారులను ఎస్‌ఈసీ ఆదేశించింది. ఎప్పటికప్పుడు నివేది కలు పంపించాలని ఎస్‌ఈసీ తెలిపింది.