13-11-2025 12:00:00 AM
- పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అమలు
- కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు, నవంబర్ 12: అధికారులు నిజాయితీగా పని చేసినప్పుడే అరులకు సంక్షేమ పథకాలు అందుతాయని, ఇందిరమ్మ ఇండ్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాల కోసం కొందరు మధ్యవర్తులు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విషయం తన దృష్టి కి వచ్చిందని ఇలాంటివి మళ్లీ పునరావృతం అయితే అట్టి వారి పై చర్యలు తప్పవని ఎమ్మెల్యే కసిరెడ్డి హెచ్చరించారు. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి నిజమైన లబ్ధిదారు లు కు పథకాల అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
బుధవారం ఆమనగల్లు పట్టణంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్లో కళ్యాణలక్ష్మి, షాదీముబారాక్ చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ర్ట ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో మహిళలకు, రైతులకు పెద్దపీట వేస్తుందని ఆయన గుర్తు చేశారు. మహిళ ల ను కోటీశ్వరుని చేసేందుకు వడ్డీ లేని రుణాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు రవాణాకు ప్రతినెల రూ.330 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.
లబ్ధిదారులకు సంక్షేమ పథకాల అమలు లో కార్యాలయాల చుట్టు తిప్పించుకొని వారిని ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. పార్టీలకతీతంగా అందరికీ అరులకు పథకాలు అందుతాయని ఆయన హామీ ఇచ్చారు. అధికారులు ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహిస్తే వారిని ఏట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని వారిని సున్నితంగా హెచ్చరించారు.ప్రభుత్వ పథకాల ఎంపీక కోసం అధికారులు ఎవరు కమిషన్లు తీసుకోవద్దని లబ్దిదారులు కూడా అధికారులకు కమిషన్లు ఇవ్వవద్దని ఆయన పేర్కొన్నారు.
అనంతరం 76 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారాక్ చెక్కులు, 18 మంది లబ్దిదా రులకు ఇందిరమ్మ ఇండ్ల కు సంబంధించి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అంతకుముందు కవి, గాయకుడు అందెశ్రీ కి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌ నం పాటించారు. కార్యక్రమంలోమార్కెట్ చైర్పర్సన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లు సంపత్ కుమార్, శ్రీశైలం, ఎంపీడీవో కుసుమ మాధురి, తహసీల్దార్ ఫాహీం ఖాద్రీ, మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్, గృహనిర్మాణ శాఖ ఏఈ బట్టు శాలిని, ఆర్ ఐ సంపత్ కుమార్ పాల్గొన్నారు.