10 March, 2026 | 4:08 PM

బహ్రెయిన్‌ నుంచి తెలుగు ప్రజల తరలింపు

10-03-2026 02:55 PM

అమరావతి: బెహ్రెయిన్(Bahrain) లో చిక్కుకున్న 600 మంది తెలుగు ప్రజల(Telugu people) తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి రోజు ఒక విమానంలో స్వదేశానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏపీ ప్రభుత్వ నిర్దేశంతో గల్ఫ్ ఎయిర్ సంస్థతో ఏపీ భవన్ అధికారులు సంప్రదింపులు చేపట్టారు. డీజీసీఏ, పౌరవిమానయాన శాఖ అధికారులతో చర్చించిన తర్వాత గల్ఫ్ ఎయిర్ సంస్థ విమాన సేవలు ప్రారంభించింది.

గల్ఫ్ ఎయిర్ విమానం(Gulf Air plane) ఇవాళ 58 మందిని కొచ్చి విమానాశ్రయానికి తీసుకురానుంది. రేపు 138 మందితో ముంబయికి మరో విమానం రానుంది. బెహ్రెయిన్ లో తెలుగు సంఘం, భారత రాయబార కార్యాలయం ద్వారా టికెట్లు కొనుగోలు ఏర్పాట్లు చేశారు. సౌదీలోని దమమ్ ఎయిర్ పోర్టు(Dammam Airport) నుంచి విమానాలు నడిపేందుకు రంగం సిద్ధమైంది. పశ్చిమాసియాలో చిక్కుకున్న తెలుగువారికి సహాయం కోసం ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ద్వారా తెలుగు వారిని ఏపీ భవన్ అధికారులు అప్రమత్తం చేశారు. గల్ఫ్, బెహ్రెయిన్ తెలుగు సంఘాల వారితో ఏపీ భవన్ అధికారులు(AP Bhavan officials) జతచేస్తున్నారు.