10 March, 2026 | 5:07 PM

గ్రామాల్లోని పశువులకు టీకాలు తప్పనిసరి

10-03-2026 03:44 PM

 సర్పంచ్ సోలిపురం అశ్విని కన్నా రెడ్డి.

తుంగతుర్తి,(విజయక్రాంతి): గ్రామాల్లోని రైతులు తమ పశువులకు టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని వెలుగు పల్లి సర్పంచ్ అశ్విని రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వెలుగు పల్లి గ్రామంలో పశువులకు టీకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశువులకు రోగాలు రాకుండా నివారణ కోసం టీకాలు తప్పనిసరి అని అన్నారు. గ్రామంలో 16 ఆవులు, 96 గేదెలకు టీకాలు వేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ ఏ నరేష్, ఉప సర్పంచ్ సాయికుమార్ ,సిబ్బంది రాజశేఖర్ , శ్రీను, రవి, కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.