బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన టెహ్రాన్
10-03-2026 03:06 PM
యుద్ధం ఎప్పుడు ముగియాలో తమదే నిర్ణయమన్న ఇరాన్
దీర్ఘకాల యుద్ధానికి సిద్ధం
ఇజ్రాయెల్, సౌదీ, కువైట్ లపై ఇరాన్ దాడి
టెహ్రాన్ : ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు 11 రోజు కొనసాగుతున్నాయి. బాంబు పేలుళ్లతో(bomb blasts) టెహ్రాన్ దద్దరిల్లింది. ఇజ్రాయెల్, సౌదీ, కువైట్ లపై ఇరాన్ ప్రతిదాడి చేసింది. దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్,సౌదీ అరేబియా, కువైట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. చమురు నిక్షేపాల వైపు వచ్చిన 2 డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ ప్రకటించింది. 6 డ్రోన్లను తమ నేషనల్ గార్డ్ కూల్చివేసిందని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. యుద్ధం ఎప్పుడు ముగియాలో తమదే నిర్ణయమేనని ఇరాన్ సైనిక ప్రతినిధి ప్రకటించారు.




