17 April, 2026 | 11:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

21-06-2025 06:32 PM

జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్(District SP Kantilal Patil) అన్నారు. శనివారం వాంకిడి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు  వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి  కృషి చేయాలని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా  ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  సి ఐ సత్యనారాయణ,ఎస్సై ప్రశాంత్ , సిబ్బంది పాల్గొన్నారు.