17 April, 2026 | 9:39 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

డ్రగ్స్‌పై యుద్ధానికి కదలి రావాలి

21-06-2025 06:30 PM

జేఏసీ పోరాటానికి బలమివ్వాలి..

హుస్నాబాద్ ఏసీపీ సదానందం..

హుస్నాబాద్: డ్రగ్స్, బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్‌పై యుద్ధానికి ప్రతి ఒక్కరూ కదలి రావాలని, నియోజకవర్గ జేఏసీ చేస్తున్న పోరాటానికి బలమివ్వాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం(ACP Sadanandam) పిలుపునిచ్చారు. శనివారం హుస్నాబాద్ లోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర ముగింపు సభలో ఆయన చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. గ్రామాలలో విస్తరిస్తున్న డ్రగ్స్, బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్ పై యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి మహిళ తన ఇంటిని, తన ఊరును కాపాడుకోవడానికి బాధ్యతగా చైతన్యం కావాలన్నారు. అందరూ జేఏసీ పోరాటానికి మద్దతుగా నిలవాలన్నారు. డ్రగ్స్ నిర్మూలన జరిగినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందన్నారు.

యువతలో నైతిక విలువలు పెరగాలి

హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి మాట్లాడుతూ, నేటి యువత చదువుతో పాటు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, నైతిక విలువలతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ, దేశాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల వినియోగం ఒక ప్రధాన సమస్య అన్నారు. అందుకే యువత మత్తు పదార్థాలకు, బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ గేమ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సభలో జేఏసీ హుస్నాబాద్ నియోజకవర్గ  కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్లు మేకల వీరన్న, సారయ్య, హుస్నాబాద్ ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చిత్తారి రవి, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.