ఇక నిర్మాతగానూ..
తన సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన నటి నిత్యామీనన్(Actress Nithya Menen) కెరీర్‌లో ఒక ముఖ్యమైన ల్యాండ్‌మార్క్‌ను చేరుకున్నారు. దాదాపు 50కి పైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఈ బ్యూటీ ఇప్పుడు నిర్మాతగా కొత్త జర్నీ ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటిస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
‘కీయూరి ప్రొడక్షన్స్ బ్యానర్, లీయో విజన్ ప్రొడక్షన్స్ సహకారంతో తన మొదటి చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. విలక్షణ దర్శకుడు డీకే ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తుండగా, నిత్యమీనన్‌కు ఎంతో ఆప్తమిత్రుడైన ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాకి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం.
వీక్షకులకు నాణ్యమైన, గర్వించదగ్గ వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్‌గా కూడా అలరించబోతున్నారు. పూర్తిగా ఫాంటసీ, డార్క్ కామెడీ థ్రిల్లర్ జానర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అయితే త్వరలోనే ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ ప్రోమోను విడుదల చేయబోతున్నట్లు నిత్యామీనన్ ప్రకటించారు.






