6 April, 2026 | 10:25 PM

ఏడీఏ కోక్యనాయక్ కు ఘన సన్మానం

06-04-2026 08:58 PM

ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కూసుమంచి క్యాంపు 

కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలంలోని గతంలో ఏడీఏగా పనిచేసే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కారం చేసుకుంటూ ప్రజల మనలను పొందిన ఏడీఏ కోక్యా నాయక్ ఇటీవల కాలంలో ఎదులాపురం మున్సిపాలిటీ ఏడిఏ గా బదిలీపై వెళ్లిన సంగతి పాఠకులకు విధితమే. వారికి సోమవారం నాయకన్ గూడెం ఫంక్షన్ హాల్ లో రైతుల ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూసుమంచి క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రస్తుత ఏడిఏ వెంకన్న కూసుమంచి మండల మాజీ ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్ నాయక్, జూకూరి గోపాల్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జొన్నలగడ్డ రవికుమార్, పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్ల జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కంచర్ల పవన్ రెడ్డి, మండల నాయకులు కంచర్ల వీరారెడ్డి, వీరన్న మాజీ ఎంపీటీసీ సభ్యులు లింగారెడ్డి, సర్పంచులు సైదమ్మ, కొండలరావు, నరేష్, రైతులు కూసుమంచి మండల విద్యుత్ ఏఈలు, సిబ్బంది, పాల్గొని ఘనంగా సన్మానించడం జరిగింది.