30 July, 2026 | 1:23 AM

గురు పౌర్ణిమ పూజల్లో పాల్గొన్న ఆదర్శ్‌రెడ్డి

30-07-2026 12:28 AM

రామచంద్రపురం, జూలై 29: గురు పౌర్ణిమ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్చార్జ్  ఆదర్శ్ రెడ్డి, భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్  సింధు ఆదర్శ్ రెడ్డి భారతి నగర్ డివిజన్ పరిధిలోని మాక్ సొసైటీ, పాత ఎం.ఐ.జి కాలనీలో నిర్వహించిన గురు పౌర్ణిమ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గురువుల ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు చేకూరాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.

గురువుల బోధనలు సమాజానికి మార్గదర్శకాలని, ప్రతి ఒక్కరూ వాటిని ఆచరణలో పెట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జగన్నాథ్ రెడ్డి, మాక్ సొసైటీ కమిటీ సభ్యులు మల్లేష్ యాదవ్, రవీందర్ రెడ్డి, పాత ఎం.ఐ.జి కాలనీ కమిటీ సభ్యులు అనిత, ప్రసాద్, రాజు, బీఆర్‌ఎస్ నాయకులు మాజీ కౌన్సిలర్ నాగమణి, సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, రాకేష్, మునీందర్, లక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.