30 July, 2026 | 1:28 AM

ఘనంగా గురుపూజ మహోత్సవం

30-07-2026 12:29 AM

నారాయణఖేడ్, జూలై 29: గురు పౌర్ణమి సందర్భంగా గురుపూజ మహోత్సవ కార్యక్రమాలు నారాయణఖేడ్ నియోజకవర్గంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు కొనసాగాయి. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దంపతులు అనుపమ సంజీవరెడ్డిలు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సైతం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఆశ్రమలలో గురుపూజ మహోత్సవం కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా భక్తులు వారి వారి గురువులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు పొందారు. పంచగామ్మ, కొండాపూర్ ఆశ్రమం, అంతర్గం ఆశ్రమం లలో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగినాయి.