30 August, 2026 | 1:26 AM

ఫారంపాండ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

30-08-2026 12:19 AM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలంలోని రోల్లపాడు, లచ్చగూడెం గ్రామపంచాయతీల్లో జరుగుతున్న ఫారంపాండ్ల పనులను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు ఎంపీడీవో కొండపల్లి శ్రీదేవి తెలిపారు. పనుల వద్ద మస్టర్లను పరిశీలించి, కూలీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి గ్రామపంచాయతీలో ప్రతిరోజూ, కనీసం 80 మంది కూలీలు పనులకు, హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లను ఆదేశించారు. సోమవారం నుంచి ఎక్కువ మంది,కూలీలతో ప్రతి గ్రామపంచాయతీలో, కనీసం 5 నుంచి 6 ఫారం పాండ్ల పనులను చేపట్టి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.