బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
30-08-2026 12:57 AM
చేగుంట,(విజయక్రాంతి): బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన మాసాయిపేట్ మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది, చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చెవురు దాసు(46) ఆగస్టు 22న తూప్రాన్ నుండి తన గ్రామానికి తిరిగి వస్తుండగా మాసాయిపేట్ పట్టణ కేంద్రంలో గల బంగారమ్మ గుడి వద్ద బైక్ అదుపు తప్పి కింద పడడంతో తలకు బలమైన గాయమైంది, కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం ఆర్విఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు, చేపూరి వెంకట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు, అతివేగమే అతని ప్రాణాలు తీసినట్లు వినికిడి.






