16 July, 2026 | 12:52 PM

ఆదిత్య ఠాక్రేవి పరిపక్వత లేని వ్యాఖ్యలు

11-12-2024 01:57 AM

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఫైర్

బెంగళూరు, డిసెంబర్ 10: మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటక పరిధిలోని బెలగావి నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర కటించాలని ఇటీవల శివసేన (యూబీటీ) నేత ఆదిత్యా ఠాక్రే డిమాండ్ చేశారు. దీనిపై తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పం దించారు. ఆదిత్యా ఠాక్రే వ్యాఖ్యలు పరిపక్వత లేనివని కొట్టిపడేశారు. అవి చిన్న పిల్లల వ్యాఖ్యలని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర ఎక్కిరన్ సమితి (ఎంఈఎస్) డిమాండ్ చేసినంత మాత్రాన బెలగావి యూటీ కాదని స్పష్టం చే శారు.

ఈ అంశంపై ‘ది మ హాజన్ కమిషన్’ నివేదిక బయటకు వచ్చేంతవరకు ఎవరైనా నిరీక్షించాల్సిందేనని స్ప ష్టం చేశారు. బెలగావిలో అధిక శాతం జనా భా మరాఠీ మాట్లాడుతున్న నేపథ్యంలో.. ఆ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్ కొన్నేళ్ల నుంచి ఉంది. ఎంఈఎస్ ఈ డిమాండ్‌ను భుజానికెత్తుకుని ఉద్యమిస్తోంది. ఇండియా కూటమిలోనే ఉన్న ఆదిత్య కూడా ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం.