ధర్మేంద్రకు పాటియాలా హౌస్ కోర్టు సమన్లు
11-12-2024 02:01 AM
ఆయనతో పాటు మరో ఇద్దరికి..
ముంబై, డిసెంబర్ 10: గరం ధరమ్ ధాబా ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెట్టాలని బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర టీం తనను సంప్రదించారని, దీంతో తాను రూ.63 లక్షలు పెట్టుబడి మోసపోయానని సుశీల్‌కుమార్ అనే వ్యాపారి పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించాడు.
దీంతో కోర్టు ధర్మేంద్రతో పాటు మరో ఇద్దరికి మంగళవారం సమన్లు జారీ చేసింది. నిందితులపై 420, 120 (బీ), 34 బీఎన్‌ఎస్ సెక్షన్లపై కేసులు నమోదయ్యాయి. కాగా, ఫిబ్రవరిలో కేసు విచారణకు రానుందని తెలుస్తోంది.






