9 August, 2026 | 3:49 PM

ఆదివాసి సంప్రదాయాలు.. రాబోయే తరానికి అందించాలి

09-08-2026 02:35 PM

ఘనంగా ఆదివాసీల దినోత్సవం 

సత్తుపల్లి ఆగస్టు9.( విజయ క్రాంతి): ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు అందించాలని 1వ వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్ అన్నారు. ఆదివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా,వార్డు లోని ఆదివాసీలతో కలిసి జెండాను ఆవిష్కరించారు. గుడిపాడు లోని  రామాలయానికి కావలసిన రేకుల షెడ్డును సొంత నిధులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా ఆదివాసి హక్కులు కాపాడాలని, రాబోయే తరాలకు వారి సంస్కృతి,సాంప్రదాయాలను అందించాలని, నిజాయితీకి మారుపేరు ఆదివాసీలను, గతంలో ఆదివాసీల జీవన స్థితి గతులు చాలా ఘోరంగా ఉన్నాయని,సమాజానికి దూరంగా ఉండేవారని,ప్రస్తుత సమాజం కూడా వారిని గుర్తించి,సమాజంలో కలుపుకుంటుందని, వారికోసం ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేసి,వారి అభివృద్ధికి చేయూతనిస్తుందని తెలిపారు. అదేవిధంగా బోనాలు సందర్భంగా అందరితో కలిసి బోనం ఎత్తినారు. అందరికీ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పూచి గోవర్ధన్,భోగి వీరస్వామి,రాజిని రాజేష్, విష్ణు, గుడిపాడు పెద్దలు ఉన్నారు.