21 April, 2026 | 4:41 PM

Breaking News

డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •   ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం   •  

ఫిరాయింపుల కేసు ౩కు వాయిదా

28-06-2024 12:42 AM

 ఆ ఎమ్మెల్యేలపై వేటు వేయాలి

హైకోర్టులో బీఆర్‌ఎస్ తరపున వాదనలు

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ తరఫున గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్, భద్రాచలం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. ఈ కేసుపై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ వేసిన వేర్వేరు పిటిషన్లపై తదుపరి విచారణ జులై 3కి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి  ప్రకటించారు.

సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సీ ఆర్యమ సుందరం వాదించేందుకు నిలబడగానే అడ్వొకేట్ జనరల్ ఎ సుద ర్శన్రెడ్డి కల్పించుకొని విచారణ వాయిదాకు పట్టుబట్టారు. విచారణ జరిపేందుకు కోర్టు నిర్ణయించడంతో ఆయన కోర్టు హాల్ నుంచి వెళ్లిపోయారు. అనంతరం సీ ఆర్యమ సుంద రం వాదనలు వినిపిస్తూ సుప్రీం తీర్పు ప్రకా రం స్పీకర్‌కు ఫిర్యాదు అందిన ౩ నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. మార్చి 18న స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు లేవని, జూన్ 27 వచ్చినా కనీసం నోటీసులూ జారీ కాలేదని గుర్తుచేశారు. హైకోర్టులో వేసిన పిటిషన్ అందినట్టు నిర్ధారణ అయిన 3నెలలు దాటాకా కూడా స్పందన లేదని అన్నారు.

అసెంబ్లీ రూల్స్ 6, 7 ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వులు జారీచేయవచ్చని తెలిపారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకపోతే ఫిరా యింపులను ప్రోత్సహించడమేనని చెప్పారు. మహారాష్ట్ర శివసేన, మణిపూర్ ఎమ్మెల్యేల కేసుల్లో వెలువడిన తీర్పులను ఇక్కడా అమ లుచేయాలని కోరారు. ప్రతివాదుల తరఫు సీనియర్ లాయర్లు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి వాదిస్తూ, పిటిషన్ల విచారణార్హతపై వాద నలు వినిపిస్తామని చెప్పారు. దీంతో విచారణ జులై 3కి వాయిదా పడింది. పార్టీ ఫిరాయింపునకు పాల్పడటమే కాకుండా బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఆ పదవికి రాజీనామా చేయకుండానే సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం పరాకాష్టగా అభివర్ణించారు.