5 July, 2026 | 6:30 PM

నేడు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

28-06-2024 12:25 AM

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థులు ఫలితాలను bse.telangana.gov.inలో చూసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు.