17 April, 2026 | 2:33 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

రావిచెడ్‌లో కల్తీ పాల గుట్టు రట్టు

26-02-2026 12:56 AM

నిర్వాహకుడు శ్రీశైలం గౌడ్ అరెస్ట్ 

కడ్తాల్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): కడ్తాల్ మండలంలోని రావిచెడ్ గ్రామంలో కల్తీ పాల దందా గుట్టు రట్టు అయింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో బుధవారం భారీ ఎత్తున సాగుతున్న కల్తీ పాల తయారీ కేంద్రం గుట్టును మహేశ్వరం ఎస్‌ఓటీ, స్థానిక కడ్తాల్ పోలీసులు రట్టు చేశారు. రావిచేడ్ గ్రామానికి చెందిన అనగోని శ్రీశైలం పాల సేకరణ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.

లాభాపేక్షతో షాద్‌నగర్ నుంచి కల్తీ పాలకు కావలసిన ముడి పదార్థాలను సేకరించి, తన నివాసంలోనే కృత్రిమ పాలను తయారు చేస్తు న్నాడు. నమ్మదగిన సమాచారం మేరకు మహేశ్వరం ఎస్‌ఓటీ బృందం, కడ్తాల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అతడిని పట్టుకున్నారు.

పోలీసుల తనిఖీల్లో కల్తీ పాలను తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 45 ప్యాకెట్ల డ్రైడ్ టీ కాఫీ క్రీమర్ (పాల చిక్కదనం కోసం), 12 ఉప్పు ప్యాకెట్లు, విడిగా ఉంచిన పంచదార,6 క్యాన్ల నిండా సిద్ధం చేసిన కృత్రిమ పాలు, పాలు రవాణా చేసేందుకు ఉపయోగించే ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు షాద్‌నగర్ నుంచి ముడి పదార్థాలను కొనుగోలు చేసి, ఇక్కడ కల్తీ పాలను తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. శ్రీశైలంను అరెస్టు చేశారు.