17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలి

26-02-2026 12:56 AM

కలెక్టర్ చంద్రశేఖర్

నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 25: ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను పేదల దరి చేర్చాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ డైరీ ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేర్చడంలో గెజిటెడ్ ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు.

గెజిటెడ్ అధికారుల సమర్థవంతమైన మిధున నిర్వహిస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని జిల్లా కలెక్టర్ గా మంచి పేరు ఉంటుందని ప్రభుత్వానికి జిల్లా అధికారుల పైన మరింత నమ్మకం కలుగుతుందన్నారు. పథకాలను ప్రజలకు చేరితేనే ప్రభుత్వానికి మంచి పేరు ఉద్యోగులుగా గుర్తింపు లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారులు సంఘం జిల్లా అధ్యక్షుడు యాదయ్య ప్రధాన కార్యదర్శి యాకూబ్ నాయక్,ట్రెజరర్ కోట్ల సందీప్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు అమరేందర్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ, జాకీర్, శ్రీనివాస్ మొహమ్మద్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.